బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నిన్న జైలు నుంచి విడుదలైన తర్వాత చేసిన వ్యాఖ్యలపై బీజేపీ తరపున మాజీ ఎంపీ టీజీ వెంకటేష్ ఘాటుగా స్పందించారు.
“కల్వకుంట్ల కవిత ఆవేశంతో తొందరపై శశికళలా బీజేపీ పెద్దలని ఉద్దేశ్యించి అలా మాట్లాడటం చాలా తప్పు. ఒకవేళ మేము బిఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేయాలనుకుంటే కేసీఆర్ లేదా కేటీఆర్‌లపై కేసులు నమోదు చేయించి అరెస్ట్ చేయించి ఉండేవాళ్ళం కదా? కల్వకుంట్ల కవిత చెడు సహవాసల వలననే తప్పులు చేసి జైలుకి వెళ్ళారని అందరికీ తెలుసు. కనుక ఆమె ఈవిదంగా మాట్లాడితే ఆమెకే ఇబ్బందులు కలుగుతాయి.
బీజేపీలో బిఆర్ఎస్ పార్టీ విలీనం వార్తలు ఊహాజనితమైనవే. అవి చాలా హాస్యస్పదంగా ఉన్నాయి. ఒకవేళ విలీన ప్రతిపాదనే ఉండి ఉంటే ఇంత తతంగం ఉండేదే కాదు కదా? అయినా తెలంగాణలో బలహీనపడిన బిఆర్ఎస్ పార్టీని చేర్చుకుంటే అది మాకు భారమే అవుతుంది తప్ప దాని వలన మాకు ఏం ప్రయోజనం?” అని టీజీ వెంకటేష్ అన్నారు.