సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అభిషేక్ సింఘ్వీ తెలంగాణ రాష్ట్రం నుంచి రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాష్ట్ర కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు నిరంజన్ ఈ విషయం ధృవీకరించారు. తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంఖ్యా బలం ఉన్నందున పార్టీ అధిష్టానం సూచన మేరకు ఆయన అభ్యర్ధిగా నామినేషన్ వేశారు.
ఇతర పార్టీలకు తగినంత బలం లేకపోవడంతో పోటీకి దూరంగా ఉండిపోయాయి. అయితే స్వతంత్వ అభ్యర్ధిగా పద్మరాజన్ నామినేషన్ వేసినప్పటికీ ఆయనకు ఎమ్మెల్యేల మద్దతు లేనందున ఎన్నికల సంఘం ఆయన నామినేషన్ తిరస్కరించింది. దీంతో అభిషేక్ సింఘ్వీ పోటీ లేకుండా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
రాష్ట్ర కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు నిరంజన్ ఎన్నికల అధికారి నుంచి అభిషేక్ సింఘ్వీ ఎన్నికైన్నట్లు ధృవీకరణ పత్రం తీసుకొని అధిష్టానానికి పంపించనున్నారు. ఆ తర్వాత ఆయన రాజ్యసభలో సభ్యుడుగా ప్రమాణస్వీకారం చేస్తారు.