మహిళల పట్ల అనుచితంగా మాట్లాడినందుకు బిఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ శనివారం రాష్ట్ర మహిళా కమీషన్ ఎదుట హాజరయ్యి సంజాయిషీ ఇచ్చుకున్నారు. అయితే ఆయన తిరిగి వెళుతున్నప్పుడు కమీషన్ సభ్యులలో కొంతమంది మహిళలు ఆయనకు రాఖీలు కట్టారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కేటీఆర్ కూడా ఆ ఫోటోని సోషల్ మీడియాలో పెట్టారు.
ఈవిషయం మహిళా కమీషన్ ఛైర్ పర్సన్ నేరెళ్ళ శారద దృష్టికి రావడంతో ఆమె వారిని సంజాయిషీ కోరుతూ నోటీసులు జారీ చేశారు. మహిళల పట్ల అనుచితంగా మాట్లాడారని ఆరోపణ ఎదుర్కొంటున్న ఓ రాజకీయ నాయకుడుకి కమీషన్ సభ్యులే రాఖీలు కట్టడం ద్వారా కమీషన్ నిష్పక్షపాతంగా పనిచేయడం లేదనే తప్పుడు సంకేతాలు పంపించిన్నట్లవుతుంది. కనుక కమీషన్ ప్రతిష్టకు భంగం కలిగించేవారిని ఉపేక్షించలేమని, కనుక దీనిపై వివరణ ఇవ్వాలని ఆ నోటీసులో పేర్కొన్నారు.