జీహెచ్‌ఎంసీ కమీషనర్‌గా ఆమ్రపాలికి పూర్తి బాధ్యతలు

తెలంగాణ ప్రభుత్వం మంగళవారం ఆరుగురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. ఇంతవరకు జీహెచ్‌ఎంసీ ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్న ఆమ్రపాలిని కమీషనర్‌గా నియమిస్తూ పూర్తి బాధ్యతలు అప్పగించింది. కనుక ఆమెను మూసీ అభివృద్ధి ప్రాజెక్ట్, హెచ్ఎండీఏ, హెచ్‌జీసీఎల్ (హైదరాబాద్‌ గ్రోత్ కారిడార్ లిమిటెడ్) అధనపు బాధ్యతల నుంచి తప్పించింది.

మూసీ నది అభివృద్ధి కార్పొరేషన్ ఎండీగా దాన కిషోర్, హైదరాబాద్‌ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ ఎండీగా సర్పారాజ్ అహ్మద్‌కు అధనపు బాధ్యతలు అప్పగించింది.

హెచ్ఎండీఏ జాయింట్ కమీషనర్‌గా కోట శ్రీవాస్తవ, కరీంనగర్‌ మునిసిపల్ కార్పొరేషన్ కమీషనర్‌గా చహత్ బాజ్‌పాయి, హైదరాబాద్‌ జలమండలి ఎగ్జిక్యూటివ్ డైరెక్టరుగా మాయాంక్ మిత్తల్‌ని నియమిస్తూ సీఎస్ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు.