తెలంగాణ సచివాలయం ఆవరణలో దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేయాలనే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపాదనని బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా వ్యతిరేకించారు.
“తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా కేసీఆర్ సచివాలయం కట్టిస్తే దాని ఆవరణలో రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేయాలనుకోవడం సరికాదు. అక్కడ తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేస్తే మేము స్వాగతిస్తాము కానీ రాజీవ్ గాంధీ విగ్రహం పెడితే మేము అధికరంలోకి రాగానే దానిని తొలగిస్తాము. ఇది మీ కాంగ్రెస్ పార్టీకే అవమానకరమవుతుంది.
కనుక ఈ ప్రతిపాదనని విరమించుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. అంతగా మీకు రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేసుకోవాలని ఉంటే మీ గాంధీ భవన్‌లోనో లేదా జూబ్లీహిల్స్‌లోని రేవంత్ రెడ్డి ఇంట్లోనో ఏర్పాటు చేసుకోండీ మాకేమీ అభ్యంతరం లేదు. కానీ సచివాలయంలో మాత్రం వద్దు. ఒకవేళ ఏర్పాటు చేస్తే మేము అధికారంలోకి వచ్చాక దాంతోపాటు నగరంలో ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ పేర్లన్నీ తొలగిస్తాము,” అని కేటీఆర్ హెచ్చరించారు.