కోల్‌కతా వైద్య విద్యార్ధిని కేసు సుప్రీంకోర్టు విచారణ

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న కోల్‌కతా వైద్య విద్యార్ధిని సామూహిక అత్యాచారం, హత్య కేసుని సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించింది. న్యాయవాదుల అభ్యర్ధన మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ ఈ కేసుని సుమోటోగా చేపడుతూ తొలి విచారణ ఆగస్ట్ 20 వ తేదీన చేపట్టనున్నారు. 

ఇప్పటికే కోల్‌కతా హైకోర్టు ఈ కేసు విచారణని సీబీఐకి అప్పగించింది. కనుక సీబీఐ అధికారులు రంగ ప్రవేశం చేసి ఆర్జీకర్ హాస్పిటల్‌లో వైద్యులు, సిబ్బంది, సూపరింటెండెంట్‌ని ప్రశ్నిస్తున్నారు. అయితే ఇంతవరకు దోషులను అరెస్ట్ చేయలేకపోవడంతో దేశవ్యాప్తంగా వైద్యులు, మహిళా సంఘాలు, రాజకీయ పార్టీలు నిరసనలు వ్యక్తం చేస్తూ ఆందోళనలు చేస్తున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడుగా భావిస్తున్న ఓ వ్యక్తిని సీబీఐ అదుపులో తీసుకొని ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. 

బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ ఘటనపై బీజేపీని నిందిస్తూ రాజకీయాలు చేస్తుండటంతో ఆమె కూడా విమర్శల పాలవుతున్నారు.