అక్కచెల్లెమ్మలకు సారీ: కేటీఆర్‌

బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ నిన్న తెలంగాణ భవన్‌లో పార్టీ సమావేశంలో ఆర్టీసీ బస్సులలో మహిళలు కూరగాయలు తరుక్కోవడం, బ్రష్ చేసుకోవడం, కుట్లు అల్లిక పనులు చేసుకోవడం వంటి పనుల గురించి చేసిన వ్యాఖ్యలపై మంత్రి సీతక్క స్పందిస్తూ, “మహిళల పట్ల ఇంత చులకనభావమా? మీ ఇంట్లో కూడా మహిళలు ఉన్నారు కదా?అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ఎద్దేవా చేయడానికి చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీకే ఆయుధంగా మారాయని గ్రహించగానే కేటీఆర్‌ వెంటనే స్పందిస్తూ “నిన్న పార్టీ సమావేశంలో యధాలాపంగా చేసిన వ్యాఖ్యల వలన మహిళా సోదరీమణులకు మనస్తాపం కలిగితే, నేను విచారం వ్యక్తం చేస్తున్నాను. నా అక్క చెల్లెమ్మలని కించపరిచే ఉద్దేశ్యం ఎప్పుడూ లేదు,” అని ట్వీట్‌ చేశారు. 

ఇంతకీ కేసీఆర్‌ ఏమన్నారో ఆయన మాటలలోనే...