కాంగ్రెస్ ప్రభుత్వం పంట రుణాలు మాఫీ చేసినందున బిఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు శపధం చేసిన్నట్లుగా తన పదవికి రాజీనామా చేయాలని లేదా గన్‌పార్క్ అమరవీరుల స్థూపం వద్ద ముక్కు నేలకు రాసి ప్రజలకు క్షమాపణ చెప్పాలని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు.
సిఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందిస్తూ, “ఆగస్ట్ 15వ తేదీలోగా రూ.31,000 కోట్లు పంట రుణాలు మాఫీ చేస్తానని రేవంత్ రెడ్డి దేవుళ్ళపై ఓట్లు వేశాడు. చివరికి తమ అధినేత్రి సోనియా గాంధీపై కూడా ఓట్లు వేశాడు.
కానీ రాష్ట్రంలో 56 లక్షలకు పైగా రైతులు ఉంటే వారిలో 22 లక్షల మందికి మాత్రమే రూ.17, 000 కోట్లు మాఫీ చేసి అందరికీ మాఫీ చేసేశామని అబద్దాలు చెపుతున్నావు. నిన్న సభలో ముఖ్యమంత్రిననే విషయం కూడా మరిచి నా గురించి, మా బిఆర్ఎస్ పార్టీ గురించి నోటికి వచ్చిన్నట్లు మాట్లాడావు.
నువ్వు అబద్దాల ముఖ్యమంత్రివి. సంస్కారహీనుడివి. నువ్వు పంట రుణాలు మాఫీ చేస్తానని ఓట్లు వేసి మాట తప్పినందుకు దేవుళ్ళకు తెలంగాణ రాష్ట్రం, ప్రజలపై ఆగ్రహం కలగకూడదని నేను ప్రార్ధిస్తాను,” అంటూ ట్విట్టర్లో చాలా పెద్ద సందేశమే పెట్టారు హరీష్ రావు.
సిఎం రేవంత్ రెడ్డి గురించి ఏమన్నారో హరీష్ రావు మాటలలోనే....