కోదండరామ్‌, అమీర్ అలీ ఖాన్ ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం

టీజెఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్‌, సియాసత్ ఉర్దూ పత్రిక ఎడిటర్ అమీర్ అలీ ఖాన్ ఇద్దరూ నేడు ఎమ్మెల్సీలు ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీలుగా నామినేట్ అయిన మండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్ రెడ్డి వారి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. 

కేసీఆర్‌ ప్రభుత్వం దాసోజు శ్రవణ్ కుమార్‌, కుర్ర సత్యనారాయణలను ఎమ్మెల్సీలుగా నిమించాలని సిఫార్సు చేయగా, అప్పటి గవర్నర్‌ తమిళిసై సౌందర్ రాజన్‌ ఆమోదించకుండా పక్కన పెట్టేశారు. తర్వాత అధికారంలోకి వచ్చిన రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం ప్రొఫెసర్ కోదండరామ్‌, అమీర్ అలీ ఖాన్‌ల పేర్లు సిఫార్సు చేయగానే తమిళిసై సౌందర్ రాజన్‌ వెంటనే ఆమోదించి వారిని ఎమ్మెల్సీలు నామినేట్ చేశారు. 

గవర్నర్‌ నిర్ణయాన్ని సవాలు చేస్తూ బిఆర్ఎస్ నేతలు హైకోర్టుకి వెళ్ళగా ప్రొఫెసర్ కోదండరామ్‌, అమీర్ అలీ ఖాన్‌ల నియామకం చెల్లదంటూ తీర్పు చెప్పింది. కానీ హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే నాలుగు వారాల పాటు విధించింది. హైకోర్టు ఆదేశాలు చెల్లవు కనుక ప్రొఫెసర్ కోదండరామ్‌, అమీర్ అలీ ఖాన్‌ ఆలస్యం చేయకుండా ప్రమాణ స్వీకారం చేసేశారు. ఒకవేళ సుప్రీంకోర్టు తీర్పు వారికి అనుకూలంగా వస్తే పర్వాలేదు కానీ వ్యతిరేఖంగా వస్తే ఇద్దరూ తమ పదవులకు రాజీనామా చేయాల్సి ఉంటుంది.