ఎస్సీ వర్గీకరణని స్వాగతిస్తాం: కేటీఆర్‌

ఎస్సీ, ఎస్టీ వర్గీకరణపై సుప్రీంకోర్టు గురువారం ఇచ్చిన తీర్పుని స్వాగతిస్తున్నట్లు బిఆర్ఎస్‌ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ చెప్పారు. తెలంగాణ భవన్‌లో నిన్న మీడియాతో మాట్లాడుతూ, “బిఆర్ఎస్ పార్టీ ఒక్కటే మొదటి నుంచి రాజకీయాలకు అతీతంగా ఎస్సీ వర్గీకరణకు కృషి చేసింది. కేసీఆర్‌ ఈ అంశాన్ని రాజకీయ కోణంలో నుంచి కాకుండా సామాజిక కోణంలో నుంచి చూశారు కనుక మేము అధికారంలో ఉన్నప్పుడే ఎస్సీ వర్గీకరణపై శాసనసభలో తీర్మానం చేసి స్వయంగా ప్రధాని నరేంద్రమోడీని కలిసి దానిని అందజేశారు. మా ప్రయత్నాలు ఫలించి ఇన్నేళ్ళకు ఎస్సీ వర్గీకరణకు మార్గం సుగమం అయ్యింది. సుప్రీంకోర్టు తీరుని మేము స్వాగతిస్తున్నాము,” అని చెప్పారు. 

ఎస్సీ వర్గకరణపై సుప్రీంకోర్టు తీర్పు వెలువడగానే నిన్న వెంటనే స్పందించిన జగన్మోహన్‌ రెడ్డి, దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ముందుగా తెలంగాణలోనే దీనిని అమలుచేస్తామని చెప్పారు. ఇకపై విద్యా, ఉద్యోగాలకు దీనిని వర్తింపజేసి అమలుచేస్తామని శాసనసభలో ప్రకటించారు. 

ఎస్సీ వర్గీకరణకి అన్ని పార్టీలు మద్దతు ఇస్తున్నప్పటికీ దీని వలన మాలలకు నష్టం కలుగుతుంది కనుక వారు వ్యతిరేకించే అవకాశం ఉంది.