నేడు సిఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రజలకు మేలు, లబ్ధి కలిగించే పలు ప్రతిపాదనలకు ఆమోదముద్ర వేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇంత చురుకుగా ఇన్ని నిర్ణయాలు తీసుకుని అమలుచేస్తుండటం చాలా అభినందనీయం. మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే...
1. తెల్ల రేషన్ కార్డులతో ముడి పెట్టకుండా ఆరోగ్యశ్రీ కార్డులు విడిగా ఇవ్వాలని నిర్ణయించారు.
2. కొత్త రేషన్ కార్డులు జారీ చేయడానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో కేబినెట్ సమిటీ ఏర్పాటు.
3. శుక్రవారం శాసనసభ సమావేశంలో సిఎం రేవంత్ రెడ్డి జాబ్ క్యాలండర్ ప్రకటిస్తారు.
4. క్రీడాకారులు ఈశాసింగ్, నికత్ జరీన్, సిరాజ్ ముగ్గురిక్కీ గ్రూప్-1 ఉద్యోగాలు, ఒక్కక్కరికీ హైదరాబాద్ 600 చదరపు గజాల నివాస స్థలం ఇవ్వాలనే ప్రతిపాదనకు ఆమోదముద్ర వేశారు.
5. ఇటీవల డ్యూటీలో ఉండగా చనిపోయిన రాజీవ్ రతన్ కుమారుడికి మునిసిపల్ కమీషనర్‌గా నియామకం. మరో అధికారి కుమారుడికి గ్రూప్-1 ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయించారు.
6. గౌరవెల్లి ప్రాజెక్టు పెండింగ్ పనులు పూర్తి చేయడానికి రూ.437 కోట్లు విడుదలకు ఆమోదముద్ర.
7. నిజాం చక్కెర పరిశ్రమని పునరుద్దరించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని నిర్ణయించారు.
8. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నియమించేందుకు ప్రొఫెసర్ కోదండరామ్, అమీర్ ఖాన్ పేర్లను మళ్ళీ సిఫార్సు.
9. మల్లన్న సాగర్ నుంచి హైదరాబాద్‌లోని జలాశయాలకు నీళ్ళు తరలించేందుకు ఆమోదముద్ర.
10. మూసీ సుందరీకరణ పనులను నిర్ధిష్ట కార్యాచరణ రూపొందించి, త్వరలో పనులు ప్రారంభించాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించారు.