కేంద్ర ప్రభుత్వం పది రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించింది. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ కార్యాలయం నుంచి శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ అయ్యాయి.
తెలంగాణ రాష్ట్రానికి త్రిపుర మాజీ ఉప ముఖ్యమంత్రి జిష్ణుదేవ్ వర్మని నియమించింది. ఇన్ని రోజులుగా తెలంగాణ గవర్నర్గా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్న సీపీ రాధాకృష్ణన్ని మహారాష్ట్ర గవర్నర్గా నియమించింది.
తెలంగాణ గవర్నర్ గా నియమితులైన జిష్ణుదేవ్ ప్రశాంత్ వర్మ (66) త్రిపుర రాజకుటుంబానికి చెందినవారు. ఆయన బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడుగా కూడా సేవలందించారు. 1980లో బీజేపీలో చేరారు. 2018 నుంచి 2023 వరకు 5 ఏళ్ళపాటు త్రిపుర ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు.
రాజస్థాన్ గవర్నర్: మహారాష్ట్ర మాజీ స్పీకర్ హరిభావ్ కిషన్రావ్ బాగ్డే.
అస్సాం, మణిపూర్ గవర్నర్: లక్ష్మణ ప్రసాద్ ఆచార్య.
ఝార్ఖండ్ గవర్నర్: మాజీ కేంద్రమంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్.
ఛత్తీస్ఘడ్ గవర్నర్: మాజీ ఎంపీ రమెన్ డెకా.
మేఘాలయ గవర్నర్: కర్ణాటక మాజీ మంత్రి సీహెచ్. విజయశంకర్.
పంజాబ్ గవర్నర్, చండీఘర్ అడ్మినిస్ట్రేటర్: గులాబ్ చంద్ కటారియా.
పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్: మాజీ ఐఏఎస్ అధికారి కె కైలాసనాధన్.