నీతి ఆయోగ్ సమావేశానికి ఆరుగురు డుమ్మా

నేడు ఢిల్లీలో రాష్ట్రపతి భవన్‌లోని కల్చరల్ సెంటర్‌లో ప్రధాని నరేంద్రమోడీ అధ్యక్షతన ముఖ్యమంత్రులతో నీతి ఆయోగ్ సమావేశం జరుగుతోంది. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం చేసినందుకు నిరసనగా తెలంగాణ సిఎం రేవంత్‌ రెడ్డి ఈ సమావేశానికి హాజరుకాలేదు. అలాగే కాంగ్రెస్‌ నిర్ణయం మేరకు ఆ పార్టీ ముఖ్యమంత్రులు కూడా హాజరుకాలేదు. తమిళనాడు సిఎం స్టాలిన్ కూడా ఈ సమావేశాన్ని బహిష్కరించారు.

 పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కొన్ని అంశాలపై ప్రధాని నరేంద్రమోడీకి తన నిరసన తెలిపేందుకు ఈ సమావేశానికి హాజరవుతున్నారు. ఆమె తప్ప మిగిలిన వారందరూ ఎన్డీయే కూటమికి చెందిన ముఖ్యమంత్రులే. 

ఈ సమావేశంలో కేంద్రరాష్ట్ర ప్రభుత్వాల మద్య మరింత సమన్వయం కోసం ఎటువంటి చర్యలు తీసుకోవాలనే అంశంతో పాటు ‘వికసిత్ భారత్‌-2047’ అజెండాపై చర్చించనున్నారు.

తెలంగాణతో సహా కొన్ని కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందని ఆరోపిస్తున్నప్పుడు, వాటిపై స్పందించకుండా నీతి ఆయోగ్ సమావేశంలో కేంద్రరాష్ట్ర ప్రభుత్వాల మద్య మరింత సమన్వయం గురించి చర్చిస్తుండటం హాస్యాస్పదంగా ఉంది.