తెలంగాణ బడ్జెట్‌ ముఖ్యాంశాలు

తెలంగాణ ఉప ముఖ్యమంత్రి, ఆర్ధిక మంత్రి భట్టి విక్రమార్క శాసనసభలో రాష్ట్ర బడ్జెట్‌ ప్రవేశపెడుతున్నారు. ముఖ్యాంశాలు: 

రాష్ట్ర బడ్జెట్‌ విలువ రూ.2,91,159 కోట్లు

ఆర్ధిక లోటు అంచనా: రూ. 49,255.41 కోట్లు

 ప్రాధమిక లోటు అంచనా: రూ.31,525.63 కోట్లు

రెవెన్యూ మిగులు అంచనా: రూ.297.42 కోట్లు.   

మూలధన వ్యయం: రూ.33,487 కోట్లు 

శాఖల వారీగా కేటాయింపులు: 

వ్యవసాయం: రూ.72,659 కోట్లు 

ఎస్సీ సంక్షేమం: రూ.33,124 కోట్లు

పంచాయితీరాజ్ శాఖ: రూ.29,816 కోట్లు

సాగునీటి శాఖ: రూ.22,301 కోట్లు

విద్యాశాఖ: రూ.21,292 కోట్లు

ఎస్టీ సంక్షేమం: రూ.17,056 కోట్లు

ట్రాన్స్‌కో, డిస్కంలకు: రూ.16,410 కోట్లు

వైద్య ఆరోగ్యశాఖ: రూ.11,468 కోట్లు

హోమ్ శాఖ: రూ.9,564 కోట్లు

బీసీ సంక్షేమం: రూ.9,200 కోట్లు

రోడ్లు భవనాల శాఖ: రూ.5,790 కోట్లు

స్త్రీ శిశు సంక్షేమం: రూ.2,736 కోట్లు

పౌర సరఫరాల శాఖ: రూ.3,836 కోట్లు

మైనార్టీ సంక్షేమం: రూ.3,003 కోట్లు

పరిశ్రమల శాఖ: రూ.2,762 కోట్లు 

అటవీ పర్యావరణ శాఖ: రూ. 1,064 కోట్లు

ఉద్యానవన శాఖ: రూ.737 కోట్లు  

అభివృద్ధి కార్యక్రమాలకు, ఇతర పధకాలకు: 

రీజినల్ రింగ్ రోడ్: రూ. 1,525 కోట్లు 

హైదరాబాద్‌ మెట్రో రైల్ ప్రాజెక్టులకు: రూ.600 కోట్లు 

హెచ్ఎండీఏ పరిధిలో మౌలిక వసతుల కల్పనకు: రూ.500 కోట్లు

రూ.500 గ్యాస్ సిలిండర్ల పధకానికి: రూ.723 కోట్లు.