ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు మృతి పట్ల ప్రధాని నరేంద్రమోడీ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్న చంద్రబాబు నాయుడు, మాజీ రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ తదితరులు సంతాపం వ్యక్తం చేశారు.
తెలుగు జాతికి, తెలుగు సినీ, కళా సాహిత్య రంగాలకు రామోజీరావు ఎనలేని సేవలు అందించారని, ఆయన లేని లోటుని ఎవరూ తీర్చలేరని పలువురు ప్రముఖులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న సిఎం రేవంత్ రెడ్డి స్పందిస్తూ, రామోజీరావు అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని సిఎస్ శాంతి కుమారిని ఆదేశించారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్, సైబరాబాద్ పోలీస్ కమీషనర్‌గా ఆ ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించాలని ఆదేశించారు.