ఆధిక్యతలో కాంగ్రెస్‌, బీజేపీ... వెనుకబడిన బిఆర్ఎస్ పార్టీ

తెలంగాణ లోక్‌సభ ఎన్నికల ఫలితాల గురించి ఎగ్జిట్ పోల్స్‌ సూచించిన్నట్లుగానే కాంగ్రెస్‌, బీజేపీలు ఆధిక్యతలో కొనసాగుతుండగా బిఆర్ఎస్ పార్టీ వెనుకబడిపోయింది. 

బీజేపీ అభ్యర్ధులు ఈటల రాజేందర్‌(మల్కాజ్‌గిరి), బండి సంజయ్‌(కరీంనగర్‌), డీకే అరుణ (మహబూబ్ నగర్‌), రఘునందన్ రావు (మెదక్), ధర్మపురి అర్వింద్ (నిజామాబాద్‌), బూర నర్సయ్య గౌడ్ (భువనగిరి), ఆరూరి రమేష్ (వరంగల్‌), నగేష్ (ఆదిలాబాద్‌) ఆధిక్యంలో దూసుకుపోతుండగా హైదరాబాద్‌ నుంచి పోటీ చేసిన మాధవీలత పోటీలో వెనుకబడిపోయారు. ఎగ్జిట్ పోల్స్‌ కూడా అసదుద్దీన్‌  ఓవైసీ చేతిలో ఆమె ఓడిపోబోతున్నారనే సూచించాయి. 

కాంగ్రెస్‌ అభ్యర్ధులలో వంశీకృష్ణ (పెద్దపల్లి), బలరాం నాయక్( మహబూబాబాద్), సురేశ్ షెట్కర్ (జహీరాబాద్), కొండా విశ్వేశ్వర్ రెడ్డి (చేవెళ్ళ), కె.రఘువీర్ రెడ్డి (నల్గొండ) ఆధిక్యంలో ఉన్నారు.