త్వరలో ఉపాధ్యాయుల బదిలీలు, ప్రమోషన్లు

తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల కారణంగా ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ నిలిచిపోయింది. అయితే పోలింగ్‌ పూర్తయింది కనుక కేంద్ర ఎన్నికల కమీషన్‌ అనుమతి తీసుకొని త్వరలోనే ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు చేపడతామని రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఉపాధ్యాయ సంఘాల నేతలకు హామీ ఇచ్చారు.

ఉపాధ్యాయుల సమస్యలు, పాఠశాలలు, విద్యార్దులకు సంబందించి వారు చెప్పిన పలు అంశాలపై బుర్రా వెంకటేశం సానుకూలంగా స్పందించారు. వీలైనంత త్వరగా ఉపాధ్యాయుల బదిలీలు, ప్రమోషన్ల ప్రక్రియను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. 

విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఉపాధ్యాయ సంఘాల నేతలలో పిఆర్‌టియూటీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శులు పి.శ్రీపాల్ రెడ్డి, బి.కమలాకర్ రావు, నర్సీ రెడ్డి, జంగయ్య, అశోక్ కుమార్మ్ లింగారెడ్డి, చావా రావు, నాగి రెడ్డి, సదానంద గౌడ్, సోమయ్య, రాధాకృష్ణ, గీతాంజలి, లక్ష్మారెడ్డి., హరికృష్ణ, రాజన్న, రమేష్, శ్రీను నాయక్, వెంకట్రావు, కొండయ్య పోచయ్య, కృష్ణుడు తదితరులున్నారు.