బిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్‌పై ఎన్నికల సంఘం విధించిన 48 గంటలు నిషేదం గడువు శుక్రవారం రాత్రి 8 గంటలతో ముగుస్తుంది. కనుక ఈరోజు రాత్రి 8 గంటల తర్వాత పెద్దపల్లి జిల్లా రామగుండంలో మళ్ళీ రోడ్ షోతో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. రాత్రి అక్కడే బస చేస్తారు.
రేపు (శనివారం) సాయంత్రం మంచిర్యాలలో, ఆదివారం సాయంత్రం జగిత్యాలలో, సోమవారం సాయంత్రం నిజామాబాద్‌లో, మంగళవారం సాయంత్రం మెదక్‌లో కేసీఆర్ రోడ్ షో నిర్వహిస్తారు.
మే 8 ఉదయం నర్సాపూర్‌లో, సాయంత్రం పటాన్ చెరులో రోడ్ షోలు నిర్వహిస్తారు. మే 9 సాయంత్రం కరీంనగర్‌లో రోడ్ షో నిర్వహిస్తారు. మే 10వ తేదీన సిరిసిల్లలో రోడ్ షో నిర్వహించిన తర్వాత సిద్ధిపేటలో బహిరంగ సభ నిర్వహించి ఎన్నికల ప్రచారం ముగిస్తారు.