సోషల్ మీడియాలో ప్రవేశించిన కేసీఆర్‌

తెలంగాణ సిఎం రేవంత్‌ రెడ్డి మొదటి నుంచి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గానే ఉండేవారు. అదే శాసనసభ ఎన్నికలలో ఆయనకు, కాంగ్రెస్ పార్టీకి బాగా కలిసి వచ్చింది. కేసీఆర్‌కి కూడా సోషల్ మీడియా ప్రాధాన్యత తెలిసి ఉన్నప్పటికీ ఆ బాధ్యతలను తన కుమారుడు, బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌కు పూర్తిగా అప్పగించేశారు.

రేవంత్‌ రెడ్డి కంటే కేటీఆర్‌ సోషల్ మీడియాలో చాలా చురుకుగా ఉండటంతో బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నంత కాలం అంతా సజావుగానే సాగిపోయింది. కానీ శాసనసభ ఎన్నికలలో ఓటమి తర్వాత కేసీఆర్‌ కూడా సోషల్ మీడియా ద్వారా సామాన్య ప్రజలతో టచ్‌లో ఉండటం ఎంత అవసరమో గుర్తించిన్నట్లే ఉన్నారు. అందుకే ఆయన కూడా సోషల్ మీడియాలోకి వచ్చేశారు. 

ఇవాళ్ళ బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా @KCRBRSPresident అనే హ్యాండిల్‌తో కేసీఆర్‌ ట్విట్టర్‌లో తన సొంత ఖాతా ప్రారంభించారు. అలాగే ఫేస్ బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా ఖాతాలు తెరిచారు.

వాటి ద్వారా “బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు,” అంటూ ఆనాడు తెలంగాణ ఉద్యమ సమయంలోని ఫోటోను పోస్ట్ చేశారు.

కనుక ఇకపై సామాన్య ప్రజలు సైతం సోషల్ మీడియా ద్వారా కేసీఆర్‌కు తమ అభిప్రాయాలూ, ఆలోచనలు, సలహాలు పంచుకోవచ్చు. ఆయన అభిప్రాయాలూ, ఆలోచనలపై స్పందించవచ్చు. 

<blockquote class="twitter-tweet"><p lang="te" dir="ltr">బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు! <a href="https://t.co/X1FxmEugmN">pic.twitter.com/X1FxmEugmN</a></p>&mdash; KCR (@KCRBRSPresident) <a href="https://twitter.com/KCRBRSPresident/status/1784132125970620805?ref_src=twsrc%5Etfw">April 27, 2024</a></blockquote> <script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script>