కరీంనగర్‌కు రాధాకిషన్ రావు

ఫోన్ ట్యాపింగ్‌ కేసులో ఏ-4 నిందితుడగా జ్యూడిషియల్ రిమాండ్‌లో ఉన్న మాజీ డీసీపీ రాధాకిషన్ రావు కొద్ది సేపటి క్రితం కరీంనగర్‌ చేరుకున్నారు. ఆయన తల్లితండ్రులు అనారోగ్యంతో కరీంనగర్‌లో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స తీసుకొంటున్నారు. కనుక తల్లిని చూసి వచ్చేందుకు అనుమతించాలని కోరుతూ రాధాకిషన్ రావు కోర్టుని అభ్యర్ధించగా ఆదివారం ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు అనుమతించింది. 

కోర్టు అనుమతించడంతో పోలీసులు ఈరోజు ఉదయం ఆయనను తీసుకొని కరీంనగర్‌ వెళ్ళారు. కొద్ది సేపటి క్రితమే వారు కరీంనగర్‌లోని ఆస్పత్రికి చేరుకున్నారు. 

ఫోన్ ట్యాపింగ్‌ కేసు విచారణలో కొత్త కొత్త విషయాలు, పేర్లు బయటకు వస్తున్నాయి. అయితే కేసు విచారణపై అవి ప్రభావం చూపే అవకాశం ఉన్నందున పోలీసులు గోప్యత పాటిస్తున్నారు. బహుశః లోక్‌సభ ఎన్నికల తర్వాత ఈ కేసులో రాజకీయ నాయకులకు నోటీసులు పంపించే అవకాశం కనిపిస్తోంది.