సిద్ధిపేటలో 106 మంది ఉద్యోగులు సస్పెండ్

మొన్న ఆదివారం సిద్ధిపేటలో రెడ్డి సంక్షేమ భవన్‌లో మెదక్ బిఆర్ఎస్‌ ఎంపీ అభ్యర్ధి వెంకట్రామిరెడ్డి, సుడా మాజీ ఛైర్మన్‌ రవీందర్ రెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఉపాధి హామీ, సెర్ఫ్ ఉద్యోగులు హాజరయ్యారు. ఈ విషయం బయటకు పొక్కడంతో ఎన్నికల సంఘానికి పిర్యాదులు అందాయి. అలాగే సిద్ధిపేట త్రీ టౌన్ పోలీస్ స్టేషన్‌లో కూడా పిర్యాదులు అందాయి. 

ఎన్నికల సంఘం వెంటనే స్పందిస్తూ వారిపై తక్షణం చర్యలు తీసుకోవాల్ని సిద్ధిపేట కలెక్టర్ మను చౌదరిని ఆదేశించింది. ఆమె వెంటనే స్పందిస్తూ వారందరినీ ఉద్యోగాలలో నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వారందరూ ప్రభుత్వోద్యోగులైనప్పటికీ ఎన్నికల నియామవళికి విరుద్దంగా ఓ రాజకీయ పార్టీ సమావేశంలో పాల్గొన్నందుకు సస్పెండ్ చేస్తున్నట్లు ఉత్తర్వులలో పేర్కొన్నారు.

వారందరినీ సస్పెండ్ చేయడమే కాకుండా శాఖపరమైన చర్యలు కూడా చెప్పట్టాలని కలెక్టర్ మను చౌదరి సంబందిత శాఖల ఉన్నతాధికారులను ఆదేశించారు. సస్పెండ్ అయిన వారిలో 38మంది సెర్ఫ్ ఉద్యోగులు, 68 మంది ఉపాధి హామీ విభాగంలో పనిచేసే ఉద్యోగులు ఉన్నారు,