సికింద్రాబాద్ కంటోన్మెంట్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత అకాల మరణంతో ఆ నియోజకవర్గానికి లోక్సభ ఎన్నికలతో పాటు మే 13వ తేదీన ఉపఎన్నిక జరుగబోతోంది. ఆమె సోదరి లాస్య నివేదిత తాను బిఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీ చేయాలనుకొంటున్నానని కనుక కాంగ్రెస్, బీజేపీలు తన ఎన్నిక ఏకగ్రీవం అయ్యేందుకు సహకరించవలసిందిగా అభ్యర్ధించారు.
కానీ కాంగ్రెస్ పార్టీ ఆమె అభ్యర్ధనను పట్టించుకోలేదు. నారాయణ శ్రీ గణేశన్ను అభ్యర్ధిగా ప్రకటించింది. ఆయన ఇంతకు ముందు బీజేపీ అభ్యర్ధిగా పోటీ చేసి లాస్య నందిత చేతిలో ఓడిపోయారు. వెంటనే కాంగ్రెస్ పార్టీలోకి మారి ఈసారి కాంగ్రెస్ అభ్యర్ధిగా బీజేపీ, బిఆర్ఎస్ పార్టీలను ఎదుర్కోబోతున్నారు.