మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు శనివారం పాలకుర్తి రైతు దీక్షలో పాల్గొన్నప్పుడు ప్రజలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “నాకు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఎటువంటి సంబందమూ లేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం నన్ను ఆ వ్యవహారంలో ఇరికించి నాపై ఒత్తిడి పెంచి కాంగ్రెస్లో చేర్చుకోవాలని ప్రయత్నిస్తోంది. అవసరమైతే నేను జైలుకైనా వెళ్తాగానీ కాంగ్రెస్ పార్టీలో చేరే ప్రసక్తే లేదు.
బిఆర్ఎస్ పార్టీకి ద్రోహం చేసి పదవుల కోసం కాంగ్రెస్ పార్టీలో చేరిన కడియం శ్రీహరి నా గురించి నోటికి వచ్చిన్నట్లు మాట్లాడుతున్నారు. ఆయన, కూతురు కావ్య బిఆర్ఎస్ పార్టీలో ఉండి ఉంటే లోక్సభ ఎన్నికలలో ఆమె తప్పకుండా వరంగల్ నుంచి గెలిచి ఉండేవారు. కానీ కాంగ్రెస్ పార్టీలో చేరి పోటీ చేస్తున్నందున తప్పకుండా ఓడిపోతారు. వారిరువురూ కేసీఆర్, బిఆర్ఎస్ పార్టీకి చేసిన ద్రోహాన్ని వరంగల్ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. కాంగ్రెస్ నాలుగు నెలల పాలన చూసిన ప్రజలు అప్పుడే విసుగెత్తిపోయారు.
లోక్సభ ఎన్నికలతో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పతనం, బిఆర్ఎస్ పార్టీ పూర్వ వైభవం ప్రారంభం కాబోతోంది. నా నలబై ఏళ్ల సుదీర్గ రాజకీయ అనుభవంతో నేను ఈ మాట చెపుతున్నాను. ఎన్నికల ఫలితాలు వచ్చాక మీరే చూస్తారు,” అని అన్నారు.