ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టయిన బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సుప్రీంకోర్టులో నిరాశ తప్పలేదు. తన అరెస్టుని సవాలు చేస్తూ ఆమె సుప్రీంకోర్టు వేసిన పిటిషన్పై నేడు విచారణ జరిపి, ఈ దశలో ఈ కేసు మెరిట్స్ (కీలక అంశాలు)ల గురించి ఆలోచించి బెయిల్ మంజూరు చేయలేమని కనుక బెయిల్ కోసం ట్రయల్ కోర్టునే ఆశ్రయించాలని సూచించింది. రాజకీయ నాయకులైనంత మాత్రన్న ఈడీ, సీబీఐలు విచారించకూడదని అనుకోవడం సరికాదని సుప్రీంకోర్టు చెప్పింది. అయితే ఈ కేసులో ఈడీ రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడిన్నట్లు కల్వకుంట్ల కవిత ఫిర్యాదు చేస్తున్నారు కనుక సంజాయిషీ కోరుతూ ఈడీకి నోటీస్ జారీ చేసింది. ఆరు వారాలలో సంజాయిషీ ఇవ్వాలని ఆదేశించింది.
ఇప్పటికే ఈ కేసుని విచారిస్తున్న ఢిల్లీ హైకోర్టు దిగువ కోర్టు (ఈడీ కోర్టు) తీర్పుని సమర్ధించింది. ఇప్పుడు సుప్రీంకోర్టు కలుగజేసుకోబోనని తేల్చి చెప్పేసింది. కనుక కల్వకుంట్ల కవిత దారులన్నీ మూసుకుపోయిన్నట్లే. కనుక మరో నేడు ఈడీ కస్టడీ ముగిసిన తర్వాత ఆమెకు జ్యూడిషియల్ రిమాండ్ మీద తిహార్ జైలుకి వెళ్ళక తప్పక పోవచ్చు.