లోక్‌సభ, శాసనసభ ఎన్నికల షెడ్యూల్ జారీ

ఈరోజు (శనివారం) మధ్యాహ్నం 3 గంటలకు ఢిల్లీలో కేంద్ర ఎన్నికల కమీషనర్‌ రాజీవ్ కుమార్‌ లోక్‌సభ మరియు ఏపీ, ఒడిశా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ నాలుగు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించారు. దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ తక్షణం అమలులోకి వస్తుందని,  లోక్‌సభ ఎన్నికలను మొత్తం ఏడు దశలలో నిర్వహించబోతున్నట్లు తెలిపారు. రాజీవ్ కుమార్‌ చెప్పారు.

ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ, ఏపీ, తెలంగాణ లోక్‌సభ ఎన్నికలు నాలుగవ దశలో ఒకే దశలో ఒకేసారి జరుగబోతున్నాయి. నాలుగు రాష్ట్రాల శాసనసభ మరియు లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి జూన్ 4వ తేదీన జరుగుతాయి.