లోక్‌సభ ఎన్నికలకు మరో నలుగురు బిఆర్ఎస్ అభ్యర్ధులు ఖరారు

బిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్‌ బుధవారం తెలంగాణ భవన్‌లో పార్టీ ముఖ్యనేతలతో సమావేశమయ్యి త్వరలో జరుగబోయే లోక్‌సభ ఎన్నికలకు మరో నలుగురు అభ్యర్ధులను ఖరారు చేశారు. 

ఇది వరకు ప్రకటించిన 5మందితో కలిపి ఇప్పటి వరకు మొత్తం 9 మంది అభ్యర్ధులను ప్రకటించిన్నట్లయింది. ఈసారి ఎన్నికలలో బిఆర్ఎస్, బీఎస్పీలు పొత్తు పెట్టుకొని పోటీ చేయబోతున్నాయి. కనుక మిగిలిన 8 స్థానాలలో రెండు పార్టీలు సీట్ల సర్దుబాట్లపై చర్చించుకుని అభ్యర్ధులను ప్రకటించనున్నాయి.