తెలంగాణలో నాలుగు ఎంపీ సీట్లకు కాంగ్రెస్‌ అభ్యర్ధులు వీరే

కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ ఎన్నికలకు దేశవ్యాప్తంగా 9 రాష్ట్రాలలో 39 మంది అభ్యర్ధులతో తొలి జాబితాని నేడు ప్రకటించింది. తెలంగాణలో నల్గొండ: రఘువీర్ కుందూరు (జానారెడ్డి కుమారుడు), జహీరాబాద్: సురేష్ కుమార్‌ షెట్కర్, మహబూబ్ నగర్‌ చల్లా వంశీ చంద్ రెడ్డి, మహబూబాబాద్ (ఎస్టీ): బలరాం నాయక్‌లను కాంగ్రెస్‌ అభ్యర్ధులుగా ప్రకటించింది. 

రాహుల్ గాంధీ తెలంగాణ నుంచి పోటీ చేస్తారని వార్తలు వచ్చినప్పటికీ మళ్ళీ కేరళలో వయనాడ్ నుంచే పోటీ చేయబోతున్నారు. శశీథరూర్ కేరళలోని తిరువనంతపురం నుంచి పోటీ చేయబోతున్నారు. 

ఛత్తీస్‌ఘడ్‌ రాష్ట్రంలో ఆరుగురు, కర్ణాటక: 7, కేరళ: 16, లక్షద్వీప్‌: 1, మేఘాలయ: 2, సిక్కిం: 1, త్రిపుర: 1, తెలంగాణ: 4 మంది అభ్యర్ధులను ప్రకటించింది. 

ఈ 39 స్థానాలలో జనరల్: 15, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, ఓబీసీ: 24 మంది అభ్యర్ధులు ఉన్నారు.