లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ నలుగురు అభ్యర్ధులను ప్రకటించగా, బీజేపీ 9 మంది అభ్యర్ధులను ప్రకటించింది. కానీ అధికార కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు అభ్యర్ధులను ప్రకటించలేదు.
లోక్సభ ఎన్నికలను తన పాలనకు రిఫరెండంగా భావిస్తానని, కనీసం 12-14 ఎంపీ సీట్లు గెలుచుకోవడమే లక్ష్యమని సిఎం రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పినందున కాంగ్రెస్ అభ్యర్ధుల ఎవరనేదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
రేపు (గురువారం) ఢిల్లీలో కాంగ్రెస్ సెలక్షన్ కమిటీ సమావేశం జరుగనుంది. ఈ సమావేశానికి సిఎం రేవంత్ రెడ్డి కూడా హాజరుకాబోతున్నారు. శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని ఒంటి చేత్తో గెలిపించి తెలంగాణలో అధికారంలోకి తీసుకు వచ్చినందున, లోక్సభ అభ్యర్ధుల ఎంపికలో కూడా కాంగ్రెస్ అధిష్టానం ఆయనకు పూర్తి స్వేచ్చ ఇచ్చిన్నట్లు తెలుస్తోంది. కనుక రేపటి సమావేశం ముగియగానే సిఎం రేవంత్ రెడ్డి స్వయంగా కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధులను ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటి వరకు ప్రకటించిన బీజేపీ, బిఆర్ఎస్ పార్టీ అభ్యర్ధులు: