ప్రొఫసర్ సాయి బాబా నిర్ధోషి: బాంబే హైకోర్టు

మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలతో జీవితఖైదు అనుభవిస్తున్న ప్రొఫసర్ సాయి బాబాని బాంబే  హైకోర్టు నాగ్‌పూర్ బెంచ్ నిర్ధోషిగా ప్రకటించింది. ఆయనతో జైలు శిక్ష అనుభవిస్తున్న పాటు మరో ఐదుగురిని కూడా నిర్ధోషులుగా ప్రకటించింది.   

ఢిల్లీలోని రామ్‌లాల్ ఆనంద్ కాలేజీలో సాయిబాబా ప్రొఫెసర్‌గా పనిచేస్తుండేవారు. 2014లో మహారాష్ట్ర పోలీసులు ఆయనను అరెస్ట్ చేసి ఉగ్రవాద కార్యకలాపాలకు సంబందించిన సెక్షన్స్ క్రింద తీవ్రమైన నేరాభియోగాలతో చార్జ్ షీట్  నమోదు చేశారు.

దాదాపు మూడేళ్ళ సుదీర్గ విచారణ తర్వాత మహారాష్ట్రలోని గడ్చిరౌలి జిల్లా సెషన్స్ కోర్టు ఆయనతో సహా ఐదుగురిని ధోషులుగా నిర్ధారించి జీవిత ఖైదు విధించింది. దానిపై వారు బాంబే హైకోర్టుని ఆశ్రయించగా, పోలీసులు ఈ కేసులో ప్రొసీజర్స్ పాటించలేదని చెపుతూ కేసు కొట్టేసింది.

దానిపై మహారాష్ట్ర ప్రభుత్వం వెంటనే సుప్రీంకోర్టులో సవాలు చేయగా, వారి విడుదలపై స్టే విధిస్తూ ఈ కేసుని మహారాష్ట్ర హైకోర్టు కోర్టులోనే తేల్చుకోవాలని సూచించింది. ఈ కేసుపై పునర్విచారణ జరిపిన తర్వాత బాంబే హైకోర్టు వారిని నిర్ధోషులుగా ప్రకటించింది. దీంతో ప్రొఫెసర్ సాయిబాబాతో సహా అందరికీ జైలు నుంచి విముక్తి పొందబోతున్నారు.