త్వరలో జరుగబోయే లోక్‌సభ ఎన్నికలకు తెలంగాణలో 17 స్థానాలలో 4 స్థానాలకు బిఆర్ఎస్ పార్టీ అభ్యర్ధులను ప్రకటించింది.
కరీంనగర్: బి.వినోద్ కుమార్, పెద్దపల్లి: కొప్పుల ఈశ్వర్, ఖమ్మం: నామా నాగేశ్వర రావు, మహబూబాబాద్: మాలోత్ కవిత. బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ మళ్ళీ తెలంగాణ భవన్‌కు వచ్చి స్వయంగా నియోజకవర్గాల నేతలతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ అభ్యర్ధులను ఖరారు చేస్తున్నారు. కనుక త్వరలోనే మిగిలిన అభ్యర్ధులను కూడా ఖరారు చేయనున్నారు.
ముగ్గురు బిఆర్ఎస్ ఎంపీలు బీజేపీలో చేరిపోయి ఆ పార్టీ అభ్యర్ధులుగా పోటీ చేయబోతుండటంతో ఈసారి ఎన్నికలలో సొంత మనుషులతోనే బిఆర్ఎస్ పార్టీ పోటీ పడకతప్పడం లేదు. బూర నర్సయ్య గౌడ్ (భువనగిరి), బీబీ పాటిల్ (జహీరాబాద్), పి.రాములు (నాగర్ కర్నూల్)కి బదులు ఈసారి ఆయన కుమారుడు పి. భరత్ అదే నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నారు.
కరీంనగర్‌లో బండి సంజయ్ (బీజేపీ), వినోద్ కుమార్ (బిఆర్ఎస్) ఖరారు కాగా కాంగ్రెస్ పార్టీ ఇంకా అభ్యర్ధిని ప్రకటించవలసి ఉంది.