పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైనవారికి శుభవార్త

తెలంగాణ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు నిర్వహించిన పరీక్షలలో పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైనవారికి శుభవార్త! నేడు ఎల్బీ స్టేడియంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి స్వయంగా వారందరికీ నియామక పత్రాలను స్వయంగా అందజేస్తారు.

ఇప్పటికే ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారందరికీ రాష్ట్ర హోమ్ శాఖ ఈవిషయం తెలియజేసి, నియామక పత్రాలు అందుకోవడానికి హైదరాబాద్‌ రావలసిందిగా కోరింది. 

పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు 2022 ఏప్రిల్‌లో ఈ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. గత ఏడాది అక్టోబరులో ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్ధుల తుది జాబితాని ప్రకటించింది. పోలీస్ శాఖ, పోలీస్ శాఖలో రవాణా విభాగం, జైళ్ళ శాఖ, అగ్నిమాపక శాఖ, ఎక్సైజ్ శాఖ, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ విభాగాలలో మొత్తం 16, 604 పోస్టులలో 12,866 పోస్టులకు అభ్యర్ధులు ఎంపికయ్యారు. 

సుమారు రెండేళ్ళుగా సాగుతున్న ఈ నియామక ప్రక్రియలో ఎదరవుతున్న అవాంతరాలు, మద్యలో ఎన్నికలు జరిగి ప్రభుత్వం మారడంతో కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎన్నికైన అభ్యర్ధులు తీవ్ర నిరాశ నిస్పృహలతో వేచి చూస్తున్నారు.

వారి ఆందోళనను అర్దం చేసుకున్నామని వీలైనంత వేగంగా న్యాయవివాదాలను పరిష్కరించి వారికి నియామక పత్రాలు అందజేస్తామని సిఎం రేవంత్‌ రెడ్డి హామీ ఇచ్చారు. ఆ హామీని నిలబెట్టుకుంటూ నేడు వారికినియామక పత్రాలు అందజేయబోతున్నారు.