నేడు భారత 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన పద్మ అవార్డులను ప్రకటించింది. ప్రముఖ తెలుగు సినీ నటుడు చిరంజీవి, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడులకు పద్మ విభూషణ్ అవార్డులతో సత్కరించబోతోంది.
మొత్తం 132 పద్మ అవార్డులు ప్రకటించగా వాటిలో ఐదుగురికి పద్మ విభూషణ్, 17 మందికి పద్మ భూషణ్, 110 మందికి పద్మశ్రీ అవార్డులకు ఎంపిక చేసింది.
పద్మ విభూషణ్ అవార్డులు:
1. కొణిదెల చిరంజీవి (కళారంగం) ఆంధ్రప్రదేశ్
2. ఎం. వెంకయ్య నాయుడు (ప్రజా వ్యవహారాలు) ఆంధ్రప్రదేశ్
3. వైజయంతీ మాల బాలి (కళారంగం) తమిళనాడు
4. పద్మ సుబ్రమణ్యం (కళారంగం) తమిళనాడు
5. బిదేశ్వర్ పాఠక్ (సామాజిక సేవ) బిహార్
పద్మ భూషణ్ అవార్డులు:
• మిధున్ చక్రవర్తి, బాలీవుడ్ నటుడు (కళలు) పశ్చిమ బెంగాల్
• స్వర్గీయ కెప్టెన్ విజయకాంత్, కోలీవుడ్ నటుడు (కళలు) తమిళనాడు
• ఉషా ఊతప్ (కళలు) పశ్చిమ బెంగాల్
• దత్తాత్రేయ అంబాదాస్ (కళలు) మహారాష్ట్ర
• ప్యారేలాల్ శర్మ: (కళలు) మహారాష్ట్ర
• కుందన్ వ్యాస్: (సాహిత్యం, విద్య, జర్నలిజం) మహారాష్ట్ర
• హర్మస్ జీ ఎన్ కామ: (సాహిత్యం, విద్య, జర్నలిజం) మహారాష్ట్ర
• అశ్విన్ బాలచంద్ మెహతా: (వైద్యం) మహారాష్ట్ర
• తేజస్ మధుసూధన్ పటేల్: (వైద్యం) గుజరాత్
• చంద్రేశ్వర్ ప్రసాద్ ఠాకూర్: (వైద్యం) బిహార్
• సీతారాం జిందాల్: (వాణిజ్యం, పరిశ్రమలు) కర్ణాటక
• యువాంగ్ లీయు: (వాణిజ్యం, పరిశ్రమలు) తైవాన్
• స్వర్గీయ సత్యబ్రత ముఖర్జీ: (ప్రజా వ్యవహారాలు)
• ఎం.ఫాతిమా బీవి: (ప్రజా వ్యవహారాలు) కేరళ
• రామ్ నాయక్: (ప్రజా వ్యవహారాలు) మహారాష్ట్ర
• ఓలంచెరి రాజగోపాల్: (ప్రజా వ్యవహారాలు) కేరళ
• స్వర్గీయ తోగ్ధాన్ రిన్ పోచే: (ఆధ్యాత్మికం) లద్దాఖ్
పద్మశ్రీ అవార్డులు అందుకోబోతున్న ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందినవారు:
• గడ్డం సమ్మయ్య: (కళలు) తెలంగాణ
• దాసరి కొండప్ప: (కళలు) తెలంగాణ
• కేశావత్ సోమ్ లాల్: (లిటరేచర్ & ఎడ్యుకేషన్) తెలంగాణ
• కూరెల్ల విఠలాచార్య: (లిటరేచర్ & ఎడ్యుకేషన్) తెలంగాణ
• ఉమా మహేశ్వరి: (కళలు) ఆంధ్రప్రదేశ్
• సత్యేంద్ర సింగ్ లోహియా: (క్రీడలు) ఆంధ్రప్రదేశ్.
పూర్తి జాబితా కొరకు ఈ లింక్ ప్రెస్ చేయగలరు: padmaawards