ఖమ్మం జిల్లాలో నిర్మాణంలోనే ఓ ఫ్లైఓవర్ కూలిపోయింది. జిల్లాలోని వైరా-మధిర మద్య ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతోంది. గురువారం మధ్యాహ్నం హటాత్తుగా ఫ్లైఓవర్‌లో కొంత భాగం పెద్ద శబ్ధంతో కూలిపోయింది.
అదృష్టవశాత్తు ఆ సమయంలో దాని మీద, కింద కార్మికులు ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. అయితే సమీపంలోనే పనిచేస్తున్న 8 మంది కూలీలకు స్వల్పగాయాలు అయ్యాయి.
ఫ్లైఓవర్ పిల్లర్ల మద్య కాంక్రీట్ ఫిల్లింగ్ కోసం ఇనుపరాడ్లు బిగించి ఉంచగా, వాటిని పట్టి ఉంచేందుకు కిందన ఏర్పాటు చేసిన సపోర్ట్స్ ఆ బరువును కాయలేకపోవడంతో ఒక్కసారిగా ఇనుపరాడ్ల స్ట్రక్చర్ అంటూ కూలిపోయింది.
గాయపడిన కూలీలను జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించి ప్రాధమిక చికిత్స చేసి పంపించేశారు. ఈ సమాచారం అందుకున్న రోడ్లు, భవనాల శాఖ అధికారులు అక్కడకు చేరుకుని పరిశీలించి పైఅధికారులకు ప్రాధమిక నివేదిక పంపించారు.