భారత్‌లో మళ్ళీ కరోనా... మళ్ళీ లాక్‌డౌన్‌ తప్పదా?

భారత్‌లో కరోనా కేసులు మళ్ళీ శరవేగంగా పెరుగుతున్నాయి. సోమవారం ఒక్కరోజే కొత్తగా 412 కేసులు నమోదు కావడంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య 4,170కి చేరింది. ఈ కేసులో అత్యధికంగా కరోనా కొత్త వేరియెంట్ జెఎన్-1 రకానికి చెందినవి కావడం ఇంకా ఆందోళన కలిగిస్తోంది. 

బెంగళూరు నగరంలో సోమవారం 20, గోవాలో 34 కొత్త కేసులు నమోదయ్యాయి. ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాలలో కూడా కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతూనే ఉన్నాయి. తెలంగాణలో సోమవారం కొత్తగా 10 కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 55కి చేరుకొంది. ఏపీలో విశాఖ నగరంలో కరోనాతో ఓ వ్యక్తి మరణించిన్నట్లు సమాచారం. 

హైదరాబాద్‌తో సహా రాష్ట్ర వ్యాప్తంగా న్యూఇయర్ ఈవెంట్స్ పెద్ద ఎత్తున నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆ ఒక్కరోజే రాష్ట్రంలో కరోనా కేసులు గణనీయంగా పెరిగే ప్రమాదం ఉంది. కరోనా కేసులు పెరిగితే అది సులువుగా వ్యాపిస్తాయి. కనుక ప్రజలు న్యూఇయర్ ఈవెంట్స్ కు దూరంగా ఉండటమే మంచిది. ఒకవేళ వెళ్ళాలనుకొంటే తప్పనిసరిగా మాస్కులు ధరించడం మంచిది.