తెలంగాణ రాష్ట్రం మొత్తం అప్పులు: రూ.6,71,757 కోట్లు

తెలంగాణ శాసనసభ సమావేశాలలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై 42 పేజీల శ్వేతపత్రం విడుదల చేశారు. ఆ వివరాలు క్లుప్తంగా...  

• తెలంగాణ రాష్ట్రం మొత్తం అప్పులు: రూ.6,71,757 కోట్లు

• 2014-15 నాటికి అప్పులు: రూ. 72,658 కోట్లు 

• 2023 నాటికి పెరిగిన సగటు అప్పు శాతం: 24.5%

• బడ్జెట్‌-వాస్తవ వ్యయానికి మద్య తేడా: 20%

• రాష్ట్రం ఏర్పడిన తర్వాత పెరిగిన రుణభారం: 10% 

• రెవెన్యూ రాబడిలో 35% ఉద్యోగుల జీతాలకు చెల్లిస్తుండగా, మరో 34% రుణాల చెల్లింపుకు కేటాయించవలసి వస్తోంది. 

• ప్రభుత్వ నిర్వహణ రోజువారీ ఖర్చుల కోసం వేస్ అండ్ మీన్స్‌పై ఆధారపడాల్సి వస్తోంది.   

• 2014లో మిగులు రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణ 2023నాటికి అప్పుల ఊబిలో కూరుకుపోయింది.