తెలంగాణ కేడర్‌కు చెందిన ఐఏఎస్ ఆఫీసర్ ఆమ్రపాలి నిబందనల ప్రకారం ఇంతకాలం కేంద్ర సర్వీసులలో పనిచేసి ఇటీవలే తెలంగాణకు తిరిగి వచ్చారు. ఆమె తిరిగి రాగానే రాష్ట్ర ప్రభుత్వం రెండు కీలక పదవులు అప్పజెప్పింది. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ ఆధారిటీ (హెచ్ఎండీఏ)కి కమీషనర్‌గా,మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీగా నియమిస్తూ సిఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు.
గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కార్యాలయంలో ముఖ్య కార్యదర్శిగా పనిచేసిన ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సభర్వాల్ ఇంతవరకు సిఎం రేవంత్ రెడ్డిని కలవలేదని, ఆమె కేంద్ర సర్వీసులలోకి వెళ్ళిపోయేందుకు ప్రయత్నాలు చేసుకొంటున్నారని ఆమె స్థానంలో ఆమ్రపాలిని తీసుకువస్తున్నారని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. వాటిని ఆమె ఖండిస్తూ, తెలంగాణ ప్రభుత్వం ఇచ్చే ఏ బాధ్యతలైనా స్వీకరించేందుకు సిద్దంగా ఉన్నానని ట్వీట్ చేశారు.
ఇప్పుడు ఆమ్రపాలి వచ్చారు కాంగ్రెస్ ప్రభుత్వం ఆమెకు వెంటనే పదవులు కూడా కేటాయించేసింది. మరి స్మితా సభర్వాల్ పరిస్థితి ఏమిటో ఇంకా తెలియాల్సి ఉంది.