నేను భూకబ్జాలు చేయలేదు... ఆ అవసరం లేదు: మల్లారెడ్డి

సికింద్రాబాద్‌ సమీపంలోని మూడు చితలపల్లి కేశవరంలో గిరిజనులకు చెందిన 47 ఎకరాల భూమిని మాజీ మంత్రి మల్లారెడ్డి కబ్జా చేసిన్నట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. వాటిపై ఆయన స్పందిస్తూ, “వేరెవరివో భూములు కబ్జా చేయాల్సిన అవసరం నాకు లేదు. ఆ ప్రాంతంలో కొందరు గిరిజనులు, మధ్యవర్తుల మద్య అమ్మకాలు, కొనుగోలు ఒప్పందాలు జరిగిన్నట్లు నేను విన్నాను. వారికీ వారికీ మద్య ఏదో తేడా వస్తే పోలీస్ స్టేషన్‌లో పిర్యాదులు చేసుకొన్నారు. దానిలో నా పేరు కూడా చేర్చిన్నట్లు తెలుసుకొన్నాను.

అయితే ఆ భూములతో నాకు ఎటువంటి సంబందమూ లేదు. కానీ మద్యలో నా పేరు కూడా చేర్చినందున నేను దీనిపై కోర్టుకి వెళ్ళి ఈ భూముల క్రయవిక్రయాలతో నాకు ఎటువంటి సంబందమూ లేదని తెలియజేస్తాను.

ఈ వ్యవహారంలో నా పేరు చేర్చడంతో కాంగ్రెస్‌ ప్రభుత్వానికి సంబందం ఉందని నేను భావించడం లేదు. కనుక దీనిని రాజకీయకక్షగా కూడా నేను భావించడం లేదు,” అని మల్లారెడ్డి చెప్పారు.