తెలంగాణ శాసనసభ స్పీకర్గా గడ్డం ప్రసాద్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రోటెం స్పీకర్గా వ్యవహరిస్తున్న మజ్లీస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ముందుగా మంత్రులు, ఎమ్మెల్యేల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. తర్వాత గడ్డం ప్రసాద్ కుమార్ చేత కూడా ప్రమాణస్వీకారం చేయించారు.
తర్వాత ఆనవాయితీ ప్రకారం సిఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, అధికార, విపక్ష ఎమ్మెల్యేలు గడ్డం ప్రసాద్ కుమార్ను తోడ్కొని వెళ్ళి స్పీకర్ కుర్చీలో కూర్చోబెట్టారు. అసదుద్దీన్ ఓవైసీ ఆయనకు బాధ్యతలు అప్పగించి ప్రోటెం స్పీకర్ పదవి నుంచి తప్పుకొన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలిసారిగా దళితజాతికి చెందిన గడ్డం ప్రసాద్ కుమార్కు ఈ అత్యున్నత పదవి లభించింది.
సిఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, అధికార, విపక్ష ఎమ్మెల్యేలు గడ్డం ప్రసాద్ కుమార్కు అభినందనలు తెలియజేశారు. ప్రస్తుతం స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అధ్యక్షతన శాసనసభ సమావేశాలు జరుగుతున్నాయి.