9.jpg)
తెలంగాణ ఐటి పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ శనివారం అంబేద్కర్ యూనివర్సిటీలో జరిగిన ఓ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో బిజెపి సృష్టిస్తున్న అలజడులను ప్రస్తావిస్తూ, “ఏ దేవుడు చెప్పాడు మనల్ని తన్నుకు చావమని?వివిద మతాల దేవుళ్ళు ఎవరు గొప్పో తేల్చుకొందామని ఏమైనా పోటీలు పెట్టుకొన్నారా? ఎవరి తల్లి వారికి గొప్పది కానీ మరొకరి తల్లిని తక్కువ, ఎక్కువ అని మాట్లాడవచ్చా?అలాగే ఎవరి దేవుడు వారికి గొప్ప. అంతవరకే కానీ దేవుడు, మతం పేరు చెప్పుకొని ఘర్షణలు పడటం అవివేకం.
ఈవిదంగా మనలో మనం కీచులాడుకొంటూ ఉండటం వలననే ఇంత వెనకబడిపోయి ఉన్నాము. మనకంటే చైనా ఎంత అభివృద్ధి సాధించిందో అందరూ చూశారు కదా? మన దేశంలో పేదరికం, నిరక్షరాస్యత వంటి అనేక సమస్యలు పేరుకుపోయి ఉన్నాయి. అలాగే దేశంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెరిగిపోతున్నాయి. ఇటీవల రాష్ట్రపతిగా ద్రౌపదీ ముర్ము ఎన్నికైన తర్వాతే ఒడిశాలో ఆమె గ్రామానికి కరెంట్ వచ్చింది. ఇటువంటి సమస్యల గురించి ఎవరూ మాట్లాడరు. మతం పేరుతో కుమ్ములాడుకొంటారు. ఇప్పటికైనా మనం సమస్యల పరిష్కారం, అభివృద్ధి గురించి ఆలోచించి మాట్లాడటం నేర్చుకోవాలి,” అని అన్నారు.