మూడు పార్టీల తీరు.. ముచ్చటగా మూడు వాఖ్యల్లో

సోషల్ మీడియా అందరికీ అందుబాటులోకి వచ్చిన తర్వాత భావ వ్యక్తీకరణలో ప్రజలకున్న నేర్పు చూసి కవులు, రచయితలు కూడా ఆశ్చర్యపోతున్నారు. రాజకీయ నాయకులు తాము కూడా తక్కువేమీ కాదని నిరూపించుకొంటూ చక్కటి సందేశాలు పెడుతూ ప్రజలను ఆకట్టుకొంటున్నారు. టిఆర్ఎస్‌ సోషల్ మీడియా ప్రతినిధి రమేష్ మంత్రి “పక్క ముచ్చట... మనోడు మనకు కావాలి, మన పార్టీ మనకు ఉండాలి, కానీ పరాయోన్ని మనోడు అనుకొంటే మనోడు అవుతాడా...” అంటూ రాష్ట్రంలో కాంగ్రెస్‌, బిజెపి, టిఆర్ఎస్‌ మూడు ప్రధాన పార్టీల తీరును చక్కగా విశ్లేషిస్తూ ట్విట్టర్‌లో ఓ పోస్ట్ పెట్టారు. ఇది టిఆర్ఎస్‌కు అనుకూలంగా పెట్టినదే అయినా నిజమేనని అందరూ అంగీకరిస్తారు.