
సిఎం కేసీఆర్ అధ్యక్షతన గురువారం ప్రగతి భవన్లో మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తీసుకొన్న కొన్ని కీలక నిర్ణయాలు ఇవే...
• ఆగస్ట్ 15 నుంచి రాష్ట్రంలో మరో 10 లక్షల మందికి ఆసరా పింఛన్ల పంపిణీ. వీటితో కలిపి రాష్ట్రంలో పింఛను పొందేవారి సంఖ్య 46 లక్షలవుతుంది.
• ఆగస్ట్ 16వ తేదీ ఉదయం 11 గంటలకు రాష్ట్ర వ్యాప్తంగా సామూహిక జాతీయ గీతాలాపన జరపాలి.
• 5,111 అంగన్వాడీ ఉపాధ్యాయులు, ఆయా పోస్టుల భర్తీకి ఆమోదం.
• జీవో: 58, 59 కింద పేదలకు ఇళ్ళ పట్టాల పంపిణీ వేగవంతం.
• గ్రామ కంఠంలో ఇళ్ళ నిర్మాణంలో ఎదురవుతున్న సమస్యల శాశ్విత పరిష్కారానికి కమిటీ ఏర్పాటు.
• హైదరాబాద్, కోఠీ ఈఎన్టి హాస్పిటల్కు అదనంగా మరో 10 మంది ప్రత్యేక వైద్య నిపుణుల పోస్టులు మంజూరు.
• హైదరాబాద్, కోఠీ ఈఎన్టి హాస్పిటల్లో కొత్తగా ఈఎన్టి టవర్ నిర్మాణానికి ఆమోదం.
• సరోజినీదేవి కంటి ఆసుపత్రిలో నూతన భవన సముదాయం నిర్మాణానికి ఆమోదం.
• వికారాబాద్లో ఆటోనగర్ నిర్మాణానికి 15 ఎకరాలు మంజూరు.
• తాండూరు మార్కెట్ కమిటీకి యాలాలలో 30 ఎకరాలు కేటాయింపు.
• షాబాద్ నాపరాళ్ళ పాలిషింగ్ యూనిట్లు ఏర్పాటుకి టిఎస్ఐసీసీ ద్వారా 45 ఎకరాలు కేటాయింపు.
• వజ్రోత్సవాలలో భాగంగా ఈ నెల 21న జరగాల్సిన శాసనసభ సమావేశం రద్దు.
• దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆగస్ట్ 15నా 75 మంది ఖైదీల విడుదలకు ఆమోదం.