సంబంధిత వార్తలు

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వి రమణ ఈ నెల 26వ తేదీన పదవీ విరమణ చేయనున్నారు. కనుక కేంద్ర ప్రభుత్వం సూచన మేరకు ఆయన తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్ పేరును సిఫార్సు చేశారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులలో ఆయన అత్యంత సీనియర్ కనుక ఆయన నియామకానికి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రపతి ఆమోదముద్ర వేయడం లాంఛనప్రాయమే అని భావించవచ్చు. జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్ ఆగస్ట్ 25వ తేదీన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణస్వీకారం చేస్తారు. అయితే ఆయన పదవీకాలం ముగియడానికి కేవలం రెండున్నర నెలలు మాత్రమే సమయం ఉంది. కనుక నవంబర్ 8వ తేదీ వరకు ఈ పదవిలో కొనసాగుతారు.