
తెలంగాణ రాష్ట్ర పోలీస్ ప్రధాన కార్యాలయం కొరకు హైదరాబాద్, బంజారాహిల్స్‌లో రోడ్ నం.12లోని ఏడెకరాల్లో ట్విన్ టవర్స్ పేరుతో ఓ అద్భుతమైన భవన సముదాయాన్ని నిర్మిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. దాని నిర్మాణ పనులన్నీ పూర్తవడంతో ఆగస్ట్ 4వ తేదీన సిఎం కేసీఆర్ ప్రారంభోత్సవం చేయనున్నారు. ఇప్పటి వరకు ట్విన్ టవర్స్‌గా పిలుచుకొంటున్న ఆ భవనానికి ‘తెలంగాణ స్టేట్ ఇంటిగ్రేడెట్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్’ (టీఎస్‌ఐసీసీసీ) అని నామకరణం చేశారు. ఇదిప్పుడు ప్రారంభోత్సవానికి సిద్దమైనందున నగర సిపి సివి ఆనంద్, డిజిపి మహేందర్ రెడ్డి, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి గురువారం భవన సముదాయాన్ని పరిశీలించి, ప్రారంభోత్సవానికి చేయవలసిన ఏర్పాట్ల గురించి చర్చించారు.
|
తెలంగాణ స్టేట్ ఇంటిగ్రేడెట్ కమాండ్ అండ్
కంట్రోల్ సెంటర్’ (టీఎస్‌ఐసీసీసీ) వివరాలు |
||
|
నిర్మాణ వ్యయం
|
రూ.585 కోట్లు
|
|
|
శంకుస్థాపన |
2015, నవంబర్ |
|
|
ప్రారంభోత్సవం |
2022, ఆగస్ట్ 4వ తేదీన |
|
|
విస్తీర్ణం |
7 ఎకరాలు |
|
|
ఎత్తు |
83.4 మీటర్లు
(273.62 అడుగులు) |
|
|
బ్లాక్-ఏలో అంతస్తులు |
20 |
16,216 చదరపు మీటర్ల విస్తీర్ణం
|
|
బ్లాక్-బిలో అంతస్తులు |
18 |
12,320 చదరపు మీటర్ల విస్తీర్ణం |
|
బ్లాక్-సీ లో
అంతస్తులు |
జీ+2 |
7,920 చదరపు మీటర్ల విస్తీర్ణం |
|
బ్లాక్-డీలో అంతస్తులు |
జీ+1 |
2,230 చదరపు మీటర్ల విస్తీర్ణం |
|
నగర సిపి కార్యాలయం
|
18వ అంతస్తులో
|
|
|
||
|
తెలంగాణ రాష్ట్రంలో
అన్ని పోలీస్ స్టేషన్లతో, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సిసి కెమెరాలతో టీఎస్‌ఐసీసీసీ
అనుసంధానమై ఉంటుంది. సిసి కెమెరాలతో అనుసంధానమై ఉంటుంది కనుక ఈ భవనంలో భారీ స్క్రీన్స్
ఏర్పాటు చేశారు. వాటిలో రాష్ట్రంలో ఎక్కడ ఏమి జరుగుతోందో ప్రత్యక్షంగా చూడవచ్చు.
అవసరమైతే ఆయా జిల్లాలలోని సంబందిత పోలీస్ స్టేషన్‌తో వీడియో కాన్ఫరెన్సింగ్ చేయవచ్చు.
|
||