ముగ్గురు టిఆర్ఎస్‌ ఎంపీలు సస్పెండ్!

అవును ముగ్గురు టిఆర్ఎస్‌ ఏపీలు సస్పెండ్ అయ్యారు పార్టీ నుంచి కాదు... రాజ్యసభ నుంచి. నిత్యావసరం సరుకులపై జీఎస్టీ విధింపు, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం పెరుగుదలపై సభలో చర్చ జరపాలని పట్టుబడుతూ కాంగ్రెస్‌, తృణమూల్ కాంగ్రెస్‌, టిఆర్ఎస్‌, డీఎంకె సభ్యులు వెల్ లోకి దూసుకువెళ్లి నినాదాలు చేస్తూ సభా కార్యకలాపాలకు అడ్డుపడుతుండటంతో రాజ్యసభ డెప్యూటీ ఛైర్మన్ హరివంశ్ 19 ఎంపీలను వారం రోజుల పాటు సభ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. సస్పెండ్ అయినవారిలో బడుగుల లింగయ్య యాదవ్, దీవకొండ దామోదర్ రావు, వద్దిరాజు రవిచంద్రలతో పాటు తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన ముగ్గురున్నారు. మిగిలినవారు కాంగ్రెస్‌, డీఎంకె పార్టీలకు చెందిన సభ్యులు.