భారీ మెజార్టీతో రాష్ట్రపతిగా ద్రౌపదీ ముర్ము ఎన్నిక

అందరూ ఊహిస్తున్నట్లే ఎన్డీయే అభ్యర్ధి ద్రౌపదీ ముర్ము భారీ మెజార్టీతో భారత 15వ రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. గురువారం పార్లమెంట్ హౌసులో జరిగిన ఓట్ల లెక్కింపులో ద్రౌపదీ ముర్ముకు మొత్తం 6,76,803 విలువైన ఓట్లు రాగా, విపక్ష అభ్యర్ధిగా పోటీ చేసిన యశ్వంత్ సిన్హాకు 3,80,177 విలువైన ఓట్లు వచ్చాయి. కనుక ద్రౌపదీ ముర్ము 2,96,626 విలువైన ఓట్ల ఆధిక్యతతో గెలిచినట్లు కౌంటింగ్ అధికారులు ప్రకటించారు. రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్రమోడీ, పలువురు కేంద్ర మంత్రులు, అధికార, విపక్ష ఎంపీలు ఆమెకు అభినందనలు తెలిపారు. ఈ నెల 25న రాష్ట్రపతి భవన్‌లో ఆమె చేత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ప్రమాణస్వీకారం చేయిస్తారు.

 

ఓట్లు

వాటి విలువ

మొత్తం పోలైన ఓట్లు

4,754

10,72,377

సవ్యంగా ఉన్న  ఓట్లు

4,701

10,56,980

చెల్లని ఓట్లు

53

15,397

ద్రౌపదీ ముర్ము

2,824

6,76,803 (64.03%)

యశ్వంత్ సిన్హా

1,877

3,80,177 (35.97%)