మీకో దణ్ణం... నన్ను క్షమించి వదిలేయండి: నారాయణ

సిపిఐ నారాయణ రెండు రోజుల క్రితం తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవిని ఉద్దేశ్యించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. వాటిపై చిరంజీవి అభిమానులు, మెగా ఫ్యామిలీ అభిమానులు నారాయణపై సోషల్ మీడియాలో విరుచుకుపడుతున్నారు. దీంతో ఆయన ట్విట్టర్ ద్వారా చిరంజీవికి, ఆయన అభిమానులందరికీ క్షమాపణలు చెప్పి, చేతులు జోడించి దణ్ణం పెట్టి ఇంతటితో ఈ వివాదాన్ని ముగించి తనను విడిచిపెట్టాలని విజ్ఞప్తి చేశారు. 

రాజకీయాలలో పరస్పర విమర్శలు సహజమే కనుక ఆ ఉద్దేశ్యంతోనే తాను చిరంజీవిని ఉద్దేశ్యించి విమర్శించానని, అయితే భాషాదోషం వలన అవికాస్త ఘాటుగా ధ్వనించి అందరికీ బాధ కలిగించినట్లు తెలుసుకొని పశ్చాత్తాపపడుతూ క్షమించమని కోరుకొంటున్నానని సిపిఐ నారాయణఅన్నారు.