యూపీలో మళ్ళీ బిజెపి... ఎగ్జిట్ పోల్

సోమవారం యూపీలో చివరి దశ పోలింగ్‌ పూర్తవడంతో వివిద మీడియా సంస్థలు 5 రాష్ట్రాల ఎగ్జిట్ పోల్ అంచనాలను ప్రకటించాయి. వాటి ప్రకారం ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్, మణిపూర్ రాష్ట్రాలలో బిజెపి, పంజాబ్‌లో ఆమాద్మీ పార్టీ, గోవాలో కాంగ్రెస్‌, బిజెపిలకు సరిసమానమైన సీట్లు రావచ్చని అంచనా వేశాయి. ఈసారి యూపీలో బిజెపికి, యోగీ ఆధిత్యనాథ్ సర్కారుకి ఎదురుగాలి వీస్తోందని, ఈసారి అఖిలేష్ యాదవ్ నేతృత్వంలో సమాజ్‌వాదీ పార్టీ గెలిచి అధికారంలోకి రావచ్చని మొదట సర్వేలు సూచించినా, ఏడు దశల పోలింగ్ పూర్తయ్యేసరికి మళ్ళీ బిజెపి భారీ మెజార్టీతో అధికారంలోకి రాబోతోందని ఎగ్జిట్  పోల్స్ సూచిస్తుండటం విశేషం.

యూపీ ఎగ్జిట్ పోల్స్

 

బిజెపి

సమాజ్‌వాదీ

కాంగ్రెస్

బీఎస్పీ

ఇతరులు

రిపబ్లిక్ టీవీ

262-277

119-134

3-8

7-15

0

పీపుల్స్ పల్స్

220-240

140-160

6-8

12-18

8-12

ఇండియా న్యూస్

222-260

135-165

1-3

4-9

3-4

మాట్రిక్స్

262-277

119-134

3-8

7-15

2-6

న్యూస్-18

263

123

5

11

-

టైమ్స్ నౌ

225

151

9

14

4

మొత్తం సీట్లు: 403, ప్రభుత్వం ఏర్పాటుకి అవసరమైనవి :202 సీట్లు