తెలంగాణ బడ్జెట్‌ హైలైట్స్

తెలంగాణ రాష్ట్ర ఆర్ధికశాఖ మంత్రి హరీష్‌రావు ఈరోజు శాసనసభలో 2022-23 సం.లకి గాను రాష్ట్ర బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. మొత్తం రూ.2.56 లక్షల కోట్ల బడ్జెట్‌లో రెవెన్యూ వ్యయం: రూ.1.89 లక్షల కోట్లు, క్యాపిటల్ వ్యయం: రూ. 29,728 కోట్లుగా పేర్కొన్నారు.

ఇక ఆదాయం విషయానికి వస్తే..కేంద్ర పన్నుల వాటాలో రూ.18,394.11 కోట్లు, రాష్ట్రంలో పన్నుల ద్వారా వచ్చే ఆదాయం రూ.1,08,211.93 కోట్లు, పన్నేతర ఆదాయం: రూ.25,421.63 కోట్లు, గ్రాంట్ల ద్వారా: రూ. 41,001.73 కోట్లు ఆదాయం సమకూరుతుందని పేర్కొన్నారు. ఇవిగాక రుణాల ద్వారా మరో రూ.53,970 కోట్లు ఆదాయం సమకూర్చుకోబోతున్నట్లు పేర్కొన్నారు.   

సంక్షేమం: 

దళిత బంధు: రూ.17,700 కోట్లు; 

పంట రుణాల మాఫీ: రూ.16,144 కోట్లు కేటాయించారు. దీంతో ఈ మార్చి నెలాఖరులోగా రూ.50,000 పంట రుణాలను, వచ్చే మార్చిలోగా రూ.75,000 లోపు పంట రుణాలను మాఫీ చేస్తారు. దీని ద్వారా రాష్ట్రంలో 5.12 లక్షల మంది రైతులు లబ్ది పొందనున్నారు.  

ఆసరా పింఛన్లకు రూ. 11,728 కోట్లు; కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్: రూ.2,750 కోట్లు; బీసీ సంక్షేమం: రూ. 5,698 కోట్లు; ఎస్టీల సంక్షేమం: రూ.12,565 కోట్లు; బ్రాహ్మణుల సంక్షేమం: రూ.177 కోట్లు; దూప దీప నైవేద్య ప‌థ‌కానికి రూ. 12.50 కోట్లు. 

డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ళు: రూ.12,000 కోట్లు; సొంత స్థలం ఉన్నవారికి ఒక్కొక్కరికీ రూ. 3 లక్షల చొప్పున మొత్తం 4 లక్షల మందికి ఆర్ధిక సాయం; ఒక్కో నియోజకవర్గంలో 3,000 ఇండ్లు, ఎమ్మెల్యేల పరిధిలో 3.57 లక్షల ఇళ్ళు కేటాయింపు. వాటిలో నిర్వాసితులు, బాధితులకు 43,000 ఇళ్ళు కేటాయిస్తారు.

అభివృద్ధి పధకాలు: హైద‌రాబాద్ మెట్రో: రూ. 1,500 కోట్లు; దానిలో పాత‌బ‌స్తీలో మెట్రో ప్రాజెక్టు కోసం: రూ.500 కోట్లు; శంషాబాద్‌  విమానాశ్రయాన్ని మెట్రోతో అనుసంధానానికి: రూ.500 కోట్లు.

పట్టణ ప్రగతి: రూ.1,394 కోట్లు; పల్లె ప్రగతి రూ.3,330 కోట్లు; హరిత హారం: రూ.932 కోట్లు; మన ఊరు మన బడి: రూ.7,289 కోట్లు; అటవీ యూనివర్సిటీ కోసం: రూ.100 కోట్లు; మెడికల్ కాలేజీల ఏర్పాటు: రూ.1,000 కోట్లు; మ‌హిళా విశ్వ‌విద్యాల‌యానికి రూ. 100 కోట్లు; హైదరాబాద్‌ చుట్టూ పక్కల ప్రాంతాలలో త్రాగు నీటి సరఫరా కోసం: 1,200 కోట్లు (హైదరాబాద్‌లో రోజుకు 20 లీట‌ర్ల ఉచిత నీటి ప‌థ‌కానికి రూ. 300 కోట్లు); అర్బన్ మిషన్ భగీరథకు రూ. 800 కోట్లు. 

రాయితీలు, ప్రోత్సాహకాలు: టీఎస్‌ఆర్టీసీ: రూ. 1,500 కోట్లు; ప‌రిశ్ర‌మ‌ల‌కు విద్యుత్ రాయితీలు: రూ.190 కోట్లు; ; ప‌రిశ్ర‌మ‌ల‌కు ప్రోత్సాహ‌కాలుగా రూ. 2,142 కోట్లు; పావ‌లా వ‌డ్డీ ప‌థ‌కం: రూ.187 కోట్లు;

వ్యవసాయ రంగం: రూ.24,254 కోట్లు (పామాయిల్ సాగుకు రూ. 1,000 కోట్లు); రోడ్లు భవనాల శాఖ: రూ.1,542 కోట్లు (రోడ్లు మరమత్తుల కోసం); పోలీసు శాఖ‌కు రూ. 9,315 కోట్లు; పర్యాటక శాఖ: రూ.1,500 కోట్లు (కాళేశ్వ‌రం స‌ర్క్యూట్‌లో టూరిజం అభివృద్ధి కోసం).