సంబంధిత వార్తలు

ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో నేడు 7వ మరియు చివరి దశ పోలింగ్ మొదలైంది. తొమ్మిది జిల్లాలో 54 స్థానాలకు మొత్తం 613 మంది అభ్యర్ధులు పోటీ పడుతున్నారు. తొమ్మిది జిల్లాలలో 2.6 కోట్ల మంది ఓటర్లు వారి భవితవ్యాన్ని నేడు తేల్చనున్నారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. ఈ నెల 10వ తేదీన 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడతాయి.