సంబంధిత వార్తలు

ములుగు జిల్లా కేంద్రానికి సమీపంలో ఎర్రిగట్టమ్మ వద్ద శుక్రవారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మంగపేట మండలంలోని కోమటిపల్లికి చెందిన కౌసల్య (60), కిరణ్ (16), అజయ్ (12), ఆటో డ్రైవర్ జాని (23) చనిపోగా, తీవ్రంగా గాయపడి వరంగల్ ఎంజీఎం హాస్పిటల్లో చికిత్స పోందుతున్న వెన్నెల, రసూల్ అనే మరో ఇద్దరు కూడా ఈరోజు ఉదయం చనిపోయారు. మరో ఇద్దరు క్షతగాత్రులు పల్లెబోయిన పద్మ, వసంతలు ప్రస్తుతం అదే హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు.